దైవాలగూడ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దైవాలగూడలో ఈ హత్యలకు పాల్పడ్డాడు.
రాత్రి 11 గంటలకు దైవాలగూడకు వెళ్లి బాధిత బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మ అడ్డుకున్నా బలవంతంగా బాలికను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తిరిగి వెళ్లి బాలిక నాయనమ్మను, అమ్మమ్మను వెతికి మరీ అతి కిరాతకంగా చంపేశాడు. తర్వాత రాజ్ కుమార్ తన భార్యకు కాల్ చేశాడు.
ఇలా.. బయటకొచ్చానని.. పిల్లలను చూడాలని ఉందని, తాను వస్తున్నట్లు ఎవరికీ చెప్పొద్దని భార్యకు ఎమోషనల్‌గా చెప్పాడు. భర్త పిల్లలపై బెంగతో బాధపడుతున్నాడని భావించిన రాజ్ కుమార్ భార్య ఇంటికి రమ్మని చెప్పింది. భార్యను నమ్మించి ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ ఇంటికి వెళ్లగానే భార్యపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె బయటకు పరిగెత్తింది. ఈ విధంగా.. ఇంట్లోకి లాక్కెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపి కారులో పారిపోయాడు. తన కన్న తండ్రికి కాల్ చేసి ఇలా ఆరుగురిని హత్య చేశానని రాజ్‌కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి ఈ హత్యలపై ఏం చెప్పారంటే..
* రాత్రి హత్య జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది
* రెండు ప్లేస్‌లలో హత్య జరిగింది
* మొదట షాబాద్ లోని భాధితురాలి ఇంటికి రాత్రి 11 గంటలకు వెళ్ళాడు
* అక్కడ భాధితురాలి తల్లి, నానమ్మ ను హత్య చేసాడు
* మే 16 న అతని పైన ఫోక్సో కేసు నమోదు అయ్యింది
* ఈ కేసులో అతనికి బెయిల్ దొరికింది
* భార్య అతనికి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు
* బాధితురాలికి తల్లి, నానమ్మ ఉన్నారు
* కత్తితో తల్లిని నానమ్మ ను చంపాడు
* ఆ తరువాత బాలికను నగర్ కుంటికి తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేసాడు
* ఆ తరువాత తన ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలను చంపాడు
* రాజ్ కుమార్ తల్లిదండ్రులకి కాల్ చేసి నేను అరుగురిని చంపాను… నేను కూడా చనిపోతున్నాను అని చెప్పాడు
* మృతదేహాలను ఆసుపత్రికి తరలించాము
* రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు
* 7 బృందాలుగా నిందితుని కోసం గాలింపు చేపడుతున్నాం
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “దైవాలగూడలో రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు.. ఎవరిని ఎలా చంపాడంటే..”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

