సమంత: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్/ట్రైలర్ లాంచ్ వేడుకలో సమంత చాలా ఓపెన్‌గా, ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కనీసం రెండు సినిమాలు చేయడం నాకూ ఉంటుంది. కానీ ఈ ఒక్క సినిమా మాత్రం ప్రాణం పెట్టి చాలా బాగా చేశాం. అది నా ప్రామిస్ జూన్ 19న మీరే థియేటర్లలో చూస్తారు.. ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం.. ఆ రేంజ్లో ఉంటుంది” అంటూ సినిమాపై తన నమ్మకాన్ని గట్టిగా వ్యక్తపరిచారు. నిర్మాతగా తన అనుభవాన్ని పంచుకుంటూ.. “లాస్ట్ ఫైవ్ డేస్ ప్రొడ్యూసర్కుఎంత స్ట్రెయిస్ ఉందో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటిదాకా ఒక యాక్టర్ గా చాలా హాయిగా నా లైఫ్ చేశాను. సాధారణంగా సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా యాక్టర్స్, డైరెక్టర్లకే దొరుకుతుంది.
“లాస్ట్ వన్ వీక్‌గా మా అసిస్టెంట్ డైరెక్టర్లు మహేష్, శీను, అన్వేష్, వంశీ, కుశాల్.. అస్సలు నిద్రపోలేదు, కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. శీను అయితే ఇప్పుడు కూడా మిక్సింగ్లోనే ఉన్నారు. వసంత్, ప్రహాస్ డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. మిక్సింగ్ అజిత్ గారు డే అండ్ నైట్ వర్క్ చేసారు. అలాగే రాజ్ అండ్ డీకే గురించి మాట్లాడుతూ.. “వాళ్ల లైఫ్‌లో లక్ అనేది లేదు, కేవలం హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముకుంటారు. రూమ్‌లో అందరికంటే ఎక్కువగా ఎలా కష్టపడాలి అనేది వాళ్లను చూసి నేర్చుకున్నాను. చివరి నిమిషంలో సపోర్ట్ అందించి ఫైనల్ కాపీ ఈరోజే రెడీ అవ్వడానికి కారణమైన మ్యూజిక్ డైరెక్టర్లు మిక్కీ జే మేయర్, సురేష్ బొబ్బిలి, మహేష్ శంకర్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 19 తర్వాత మీ రివ్యూస్ కోసం ఎదురుచూస్తాను” అని తన అభిమానులకు ఏర్పాటు చేసారు.

