తెలంగాణ:నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో సోమవారం గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలడంతో ఓ ఇల్లు దగ్ధమైంది.సముద్రాల భాస్కర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది.
సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడి ఇంటి సామగ్రి అగ్నికి ఆహుతైంది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నారు.
హాలియా సీఐ సతీశ్ రెడ్డి, ఎస్ఐ ప్రశాంత్ (సిఐ సతీష్ రెడ్డి, ఎస్ ఐ ప్రశాంత్ )ఘటనాస్థలానికి చేరుకొన్నారు.

