తెలంగాణ:నల్లగొండ పట్టణంలో నేరాల నియంత్రణ,ట్రాఫిక్ నిబంధనలు అమలు,ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో శనివారం అర్ధరాత్రి జిల్లా పోలీసులు నాకాబందీ నిర్వహించిన.పట్టణంలోని 17 చెకింగ్ పాయింట్లలో ఈ తనిఖీల్లో 146 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 91 మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయబడ్డాయి.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (జిల్లా SP శరత్ చంద్ర పవార్ )ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో 7 మంది సీఐలు, 24 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో 30 ట్రిపుల్ రైడింగ్, 9 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయబడ్డాయి.నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 4 మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 73 వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న 97 మంది, వాహన పత్రాలు లేని 81 మందిపై చర్యలు తీసుకున్నారు. పాపిలాన్ పరికరం ఇద్దరు అనుమానితుల వివరాలను పరిశీలించారు.12 మందిరౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన రెండు బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 134 ఈ-చలాన్లు,ఇతర ఉల్లంఘనలకు సంబంధించి 11 ఈ-పెట్టి కేసులు నమోదయ్యాయి.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,ప్రజల ప్రాణ రక్షణకు పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం,హెల్మెట్ నడపడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, పుల్ రైడింగ్ చేయడం వంటి చర్యలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం జిల్లాలో ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


