తెలంగాణ:నల్లగొండ పట్టణంలో జూన్ 6వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనను నల్లగొండ టూ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్‌లో ఎన్.జి.కళాశాల సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి,ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని గుర్తు తెలియని పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 326(F),196,126(2), 324(4),292 మరియు PDPP Act-1984 సెక్షన్-4 ప్రకారం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
అనుమానాస్పద వాహనాల కదలికలు,సాంకేతిక ఆధారాలు,ప్రయాణ వివరాలను విశ్లేషిస్తూ నిందితుల జాడను కనుగొన్నారు.ప్రజల మధ్య చిత్రాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కుట్రలో భాగంగా మొదటగా నల్లగొండలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడం,సంఘటనకు ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి, కప్పదాడికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.జూన్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో నిందితులు పాలకురి అశోక్ కుమార్ గౌడ్‌కు చెందిన బలెనో కారు నంబర్ TS-07-HT-2430లో నల్లగొండకు చేరుకున్నారు. లీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం,ఆందోళన రేకెత్తించి ప్రజల మద్య ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితులైన పాలకురి అశోక్ కుమార్ గౌడ్ (45),ప్రైవేట్ లెక్చరర్, చైతన్యపురి,హైదరాబాద్ మరియు ఎలుకంటి ప్రణీత్ (23), ప్రైవేట్ ఉద్యోగి,మహేశ్వరం మండలం,రంగారెడ్డి జిల్లాలను అరెస్టు చేశారు.వారి వద్ద నేరాలకు పాల్పడిన బలెనో కారు మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను సైతం పోలీసులు విశ్లేషిస్తున్నారు.ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం,ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.
సామాజిక శాంతి, సామరస్యాలను దెబ్బతీసే కుట్రలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇటువంటి ఘటనలకు సంబంధించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది పుష్పగిరి,శివరాజు,సాయి,నరేశ్, నాగార్జున,కమల్,టూ టౌన్ సిబ్బంది బాలకోటి,షకీల్, శంకర్లను జిల్లా ఎస్పీ అభినందించారు.


