అభిషేక్ నామా ఒక ప్రత్యేకమైన కథాంశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగబంధం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారతదేశం యొక్క పౌరాణిక మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషిస్తూ ఈ కథ వ్రాయబడింది. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో పద్మనాభ స్వామి రథయాత్రతో చిత్ర బృందం తమ గ్రాండ్ పాన్-ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో, అభిషేక్ నామా తనపై నమ్మకం ఉంచినందుకు మరియు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో కాస్టిన్బ్ చేసినందుకు విరాట్ కర్ణ కృతజ్ఞతలు తెలిపారు. 2 సంవత్సరాల పాటు మొత్తం టీమ్‌తో పాటు దర్శకుడి దృష్టిని తీసుకురావడానికి తాను చాలా నిబద్ధతతో పనిచేశానని చెప్పాడు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు.
భారతీయ సంస్కృతి, మూలాలు మరియు పురాణాల గురించి గొప్ప స్థాయిలో మాట్లాడే సాహసోపేతమైన కథను తాను ఎల్లప్పుడూ ఊహించానని అభిషేక్ నామా పేర్కొన్నాడు. తన విజన్‌ని నమ్మి భారీ బడ్జెట్‌ను వెచ్చించిన నిర్మాతలు నిషితా నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ దృశ్యకావ్యానికి అనంత పద్మనాభ స్వామి రథయాత్ర గొప్ప పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ విజయానికి నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. నాగబంధంలో భారీ తారాగణం ఉంది మరియు పాటలు, సంగ్రహావలోకనం దేశవ్యాప్తంగా భారీ బజ్ మరియు అంచనాలను సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా జూలై 3న సినిమా విడుదలవుతోంది.

