టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమా రిలీజ్ చేసే అతి కొద్దిమంది హీరోల్లో అతనొకడు. అలాంటి హీరో కూడా తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో లెక్క తప్పాడు. మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. రెండోసారి చెప్పినట్లు ఆగస్టులో కూడా రిలీజయ్యేలా లేదు. చివరికి ఏడాది వెళ్లేలా ఉంది.
దీనితో తన తర్వాత సినిమాల ప్రణాళికలు కూడా దెబ్బ తిన్నాయి. ఈపాటికే చిత్రీకరణ జరుపుకోవాల్సిన సుజీత్ సినిమా ‘బ్లడీ రోమియో’ సంగతి ఎటూ తేలకుండా పోయింది. దీంతో అతను ‘ఓజీ-2’ పనులు మొదలుపెట్టేశాడు. మరి నాని దగ్గరకి వచ్చేసరికి సుజీత్ ‘బ్లడీ రోమియో’ను పట్టాలెక్కించే స్థితిలో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ అతను అందుబాటులో లేని స్థితిలో నాని ఎవరితో తన కొత్త చేస్తాడన్నది ఆసక్తికరం.
ఐతే ఇటీవల ‘బ్లాస్ట్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుభాష్ కె.రాజ్ దర్శకత్వంలో నాని కథా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే శుభాష్తో నాని సంప్రదింపులు జరిపితే జరిపి ఉండొచ్చు కానీ.. వీళ్ల కలయికలో వెంటనే సినిమా వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు. ముందు ముందు వెంకీ అట్లూరితో నాని జట్టు కడతాడని. సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తి చేసిన వెంకీ.. దాని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల. తర్వాత అతను ఫ్రీ అయిపోతాడు.
నానికి ఆల్రెడీ ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్న వెంకీ.. ‘ది ప్యారడైజ్’ పూర్తయ్యే సమయానికి కొత్త స్క్రిప్టుతో రెడీగా ఉంటాడని. వెంకీ, నాని కాంబినేషన్ గురించి కొన్నేళ్ల ముందే చర్చ జరిగింది. ఇద్దరి కలయికలో సినిమాల కోసం ఆసక్తిగానే ఉన్నారు. ఎట్టకేలకు అది ఓకే అయినట్లు సమాచారం. ఒకవేళ సుజీత్తో ‘బ్లడీ రోమియో’నే నాని ముందు చేసే అవకాశం.. మధ్యలో వెంకీ మరో సినిమా చేసుకుని వస్తాడు. కాస్త ముందో వెనుకో ఈ కలయికలో సినిమా మాత్రం ఖాయం అని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.

