Nara Lokesh Kadapa Vision: “విజన్ ఉన్నవాడు జిల్లాలో ఏదైనా చేస్తాడు. భవిష్యత్తును ముందుగానే ఊహించి అడుగులు వేస్తాడు.. అతడు రావడం ఆలస్యం కావచ్చు. ఒక్కసారి వచ్చాడా మార్పు చూస్తుంటేనే మొదలవుతుంది.
కడప జిల్లాలో విస్తృతమైన వనరులు ఉన్నాయి. వాటన్నిటికీ మించి మానవ వనరులు అధికంగా ఉన్నాయి. చదువుకున్న యువత ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. కానీ వాళ్లకు సరైన అవకాశాలు లేవు. అవకాశాల కోసం పక్కనే ఉన్న బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఇంకా కొందరు ముంబై.. హైదరాబాద్ లో స్థిరపడుతున్నారు. పండగలప్పుడు.. ఫంక్షన్లకు మాత్రమే కడప వస్తున్నారు. సొంత ఊరికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఎంత ఆనందంతో వస్తున్నారో.. వెళ్తున్నప్పుడు ఉన్న ఊరు జ్ఞాపకాలను తలుచుకుని బాధతో వెళ్లిపోతున్నారు.
ఇకపై కడప యువతకు అటువంటి బాధ లేదు. ఎందుకంటే ప్రభుత్వం కడప రూపురేఖలను కూటమి పూర్తిగా మార్చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా కడప మీద ఫోకస్ పెట్టారు. కడపలో ఇప్పటివరకు సున్నపు రాళ్లను చెర.. దోచుకున్న వాళ్లు.. తరతరాలుగా ఇక్కడ హత్యా రాజకీయాలు చేసిన వారు.. మనుషులను కేవలం అవసరాలను బట్టి మాత్రమే వాడుకున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం మనుషులకు అపర్చునిటీస్ కల్పించడం మొదలు పెట్టారు.
కడప జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా ఆయన ఒక ఆలోచన చేశారు. అది కాస్త ఇప్పుడు ఇక్కడికి యువతకు బలమైన ఆశను కల్పిస్తోంది. అది మరేంటో కాదు స్టార్టప్ కడప. ఈ భవనం పూర్తి కావచ్చింది. “కడపలో యువత సరికొత్త ఆలోచనలకు.. సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా మారబోతోంది. చంద్రబాబు నాయుడు ముందుచూపు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో కూటమి ప్రభుత్వం కడపలో ఐటి హబ్ గా మార్చుతోందని” కడప ఎమ్మెల్యే మాధవి ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దానిని నారా లోకేష్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు, హత్యా రాజకీయాలతో ఇన్నాళ్ళ వరకు అట్టుడికి పోయిన కడపను ఎలా మార్చుతామో జస్ట్ రెండు ముక్కల్లో చెప్పేశారు నారా లోకేష్. ఈ ప్రకారం చూస్తే కడప ఇకపై వేరే విధంగా మారబోతోంది. సింపుల్గా చెప్పాలంటే ఐటీ సిటీగా రూపాంతరం చెందబోతోంది. అప్పుడు ఇక్కడ యువత బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదు. ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఉన్న ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకచ్చు. చుట్టపు చూపుగా రావాల్సిన కర్మ లేదు. చుట్టాల్లోనే కలిసిపోయి దర్జాగా ఉండవచ్చు.

