హైదరాబాద్: మేడిగడ్డను ముట్టకుండానే కన్నెపల్లి నుంచి నీటిని పంపిస్తానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పంపులు ఆన్ చేయమంటే రంకెలు వేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నెపల్లి నుంచి రోజుకు 2 టిఎంసిల చొప్పున 100 రోజుల్లో 200 టిఎంసిలు లిఫ్ట్ చేయవచ్చని తెలియజేశారు. నీటిని లిఫ్ట్ చేయడమంటే.. సిఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న దృశ్యం. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. గేట్లు దింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటోంది. నాలుగేళ్ల క్రితం ఉప్పెనలా వరద వచ్చినా మేడిగడ్డ కొట్టుకుపోలేదని, అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. 9 టిఎంసిల నీరు వృథాగా పోతున్నాయని, రోజుకు 2 ఎంసిలు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లను నింపవచ్చని, 77 శాతం రిజర్వాయర్లు రోజుకు ఖాళీగా ఉన్నాయని కెటిఆర్ సూచిస్తోంది.
కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందని ఒక్కసారైనా రివ్యూ చేశారా? అని 247 టిఎంసిల వరదను తట్టుకున్న మేడిగడ్డ 9 టిఎంసిలను తట్టుకోలేదా? అని ఏపీలో పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తుకుపోసుకోవడం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లేందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడేందుకు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కక్షతో కాంగ్రెస్ రుద్దుతున్నకరువు అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి భేషజాలకు పోతున్నారని, తాము కన్నెపల్లికి పోగానే రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందని, రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పై కక్ష ఉంటే కేసులు పెట్టు కానీ..తులరైపై పగపట్టకు అని పేర్కొన్నారు. భద్రాచలానికి ముప్పంటూ ఉంటే అది పోలవరం వల్లేనని, మేడిగడ్డ రాముడు మునిగిపోతాడని అంటే ఆ రాముడికి కూడా కోపం వస్తుందని అన్నారు. జ్ఞానం ఎవరిదో..మిడిమిడి జ్ఞానం ఎవరిదో ప్రజలకు అర్థమైందని కెటిఆర్ దుయ్యబట్టారు.

