నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియలో తన జోక్యం ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ తో నియోజకవర్గానికి అన్యాయం జరిగితే తానే ప్రశ్నిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
వైసీపీవి నిరాధార ఆరోపణలు…
నెల్లూరు డీలిమిటేషన్‌పై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న కోటంరెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులు చెప్పామని, అధికారులు, చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.

