కడియం శ్రీహరి Vs కొండా సురేఖ: వరంగల్ రాజకీయాలు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. మొదట మంత్రి కొండా సురేఖ ఫోన్ టాపింగ్ విషయంలో హీరో నాగార్జున కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత కొండా మురళి జిల్లా రాజకీయాల్లో రచ్చ లేపారు. తాజాగా కడియం హాట్ టాపిక్ అయ్యారు. వరంగల్ జిల్లా ఆలయాల సమస్యలపై ఆయన నిర్వహించిన సమావేశం జిల్లా మంత్రి కొండా సురేఖకు కోపం తెప్పించింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో ససమావేశం నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
గొడవకు కారణం ఏంటి?
బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. ఈ సమాచారం తనకు ఇవ్వకుండా ఉందని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేయడమని, ప్రభుత్వ వ్యాపార నియమాల ఉల్లంఘన అని సురేఖ అభిప్రాయపడ్డారు. దేవాదాయ భూములు, ఆలయ శాఖ సమస్యలపై ఎమ్మెల్యే నేరుగా అధికారులకు తెలియజేయడం సరికాదని, ఇది పరిపాలనా వ్యవస్థలో అయోమయం సృష్టిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
సురేఖఆరోపణలు ఇవి..
తాజా నేపథ్యంలక్ష మంత్రి కొండా సురేఖ కడియం నుంచి వివరణ కోరాలి, మంత్రి అధికారాలను గౌరవించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి, పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడానికి లేఖలో సమర్పించారు. గతంలో కూడా వరంగల్ ప్రాంత వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్పందించిన కడియం..
ఈ ఫిర్యాదుపై కడియం శ్రీహరి పరోక్షంగా స్పందిస్తూ, తాను దేవాదాయ శాఖపై ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఆలయ సమస్యలను మాత్రమే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సమీక్ష చేసే హక్కు తనకు లేదని తాను బాగా తెలుసుకున్నానని చెప్పారు. ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కడియం సీనియర్ రాజకీయ నాయకుడు, తన నియోజకవర్గంలోని ఆలయ సమస్యలపై ఆసక్తి చూపడం సహజమే అయినప్పటికీ, శాఖాధికారులతో నేరుగా సమీక్ష చేయడం వివాదాస్పదమైంది.
వరంగల్లో వివాదస్పద రాజకీయాలు
కొండా సురేఖ–కడియం శ్రీహరి మధ్య ఇది మొదటి వివాదం కాదు. వరంగల్ జిల్లా ఉద్రిక్తతల్లో, ముఖ్యంగా ఆలయాలు, భూములకు సంబంధించిన అంశాల్లో ఇద్దరి మధ్య గతంలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అధికార విభజన, నియోజకవర్గ స్థాయి ప్రభావం, మంత్రి–ఎమ్మెల్యేల మధ్య ఇలాంటి ఘర్షణలకు కారణమవుతున్నాయి. దేవాదాయ శాఖ ఆలయాల అభివృద్ధి, భూముల నిర్వహణ, నిధులు వంటి సున్నితమైన అంశాలతో పనిచేస్తుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఆలయ సమస్యలను పరిష్కరించాలని కోరుకోవడం సహజం, కానీ అధికారిక సమీక్షలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలి.
పరిపాలనా ప్రోటోకాల్..
ఈ ఘర్షణ అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపాన్ని బయటపెడుతోంది. రాజ్యాంగం ప్రకారం మంత్రులకు శాఖలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కాబట్టి సమస్యలను తీసుకెళ్లవచ్చు, కానీ అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహించడం వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇలాంటి సంఘటనలు అధికారుల్లో అయోమయం కలిగిస్తాయి, నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.

