జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్ పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని చేసిన దారుణమైన వ్యాఖ్యల కారణంగా మనస్తాపానికి గురైన నిరంజన్ మరణించారని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. పవన్ ను వాడు, వీడు అంటూ నాని చేసిన వ్యాఖ్యలు నిరంజన్ ను బాగా ఇబ్బంది పెట్టాయని, అదే బాధలోనే తమ కుమారుడు చనిపోయాడని నిరంజన్ తండ్రి బహిరంగంగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద రచ్చగానే మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హన్మకొండకు చెందిన బాలుడు నిరంజన్ స్వతహాగా పవన్ కు వీరాభిమాని. అంతు చిక్కని అనారోగ్యం కారణంగా అతడు మంచానికే పరిమితం కాగా… అతడిని అతడి తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కోరికనే తన అభిమాన నటుడు పవన్ ను చూడాలని ఉందంటూ నిరంజన్ చేసిన వ్యాఖ్యలు తెలుసుకున్న పవన్… తన చిన్నారి అభిమాని కోరికను తీర్చేందుకు హన్మకొండ దాకా వెళ్లారు. తనను చూడాలన్న చిరకాల కోరికను తీర్చిన పవన్.. నిరంజన్ అడిగిన అన్ని కోరికలను తీర్చారు. దీంతో నిరంజన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అయితే ఇటీవలే ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోయిన సంగతి తెలిసిందే. పవన్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్న రావణ్ లాంటి వారితో పాటు బాధ్యతాయుతమైన పదవులను చేపట్టిన పేర్ని నాని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కావాలనే పవన్ ను వాడు వీడు అంటూ నాని చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను నిరంజన్ విన్నారట. ఈ వీడియో చూసిన వెంటనే అతడు తీవ్ర మనస్తాపానికి గురై… అదే వీడియోను పదే పదే చూశాడట. ఈ కోరికనే అతడు హఠాన్మరణం చెందాడు. ఫలితంగా నిరంజన్ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
తాజాగా పవన్ పరామర్శించిన నిరంజన్ మరణించారన్న వార్త తెలిసిన పలు మీడియా సంస్థల్లో అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశాయి. ఈ సందర్బంగా ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన నిరంజన్ తల్లిదండ్రులు అతడి మృతికి పేర్ని నానినే కారణమని తేల్చేశారు. తాను అభిమానించే పవన్ ను వాడు వీడు అంటూ నాని దుర్భాషలాడడంతో నిరంజన్ తట్టుకోలేకపోయారని… అదే వేదనలో అతడు చనిపోయాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు నానినే కారణమని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే తెర లేపింది.

