విశాలాంధ్ర – కడియం : సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి అన్నారు. మండు వేసవిలో రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకుల కష్టాలను గుర్తించి చిరు సేవా సమితి తరపున పాదరక్షలు గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు బాధితులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అభాగ్యులను ఎంతోకొంత ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సేవా స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా “చిరు సేవా సమితి” ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహించామని చిరు సేవా సమితి ఎప్పటికీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని గెడ్డం శివరత్న గణపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు సేవా సమితి సభ్యులు తాడల ప్రేమ్, గాధ గోపాలకృష్ణ, తాడల ధర్మరాజు, మల్లు రామకృష్ణ, గట్టి, కొత్తపల్లి నాని, బిట్టు, తాడల వెంకటేష్ కిరణ్ ఉన్నారు.
పోస్ట్ నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ మొదట కనిపించింది విశాలాంధ్ర.

