సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఎక్కువగా తన శిష్యులు సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సినిమా పోస్టర్ మీదా సుకుమార్ రైటింగ్స్ బేనర్ పడింది.
తాజాగా ఇడుపు కాయితం అనే సినిమాలోనూ ఆయన నిర్మాణ భాగస్వామిగా మారారు. ఈ బన్నీ వాసు నిర్మించారు. త్వరలో మరి కొన్ని చిత్రాలలో సుకుమార్ భాగస్వామి కాబోతున్నారు. ఐతే ఈ చిత్రాలన్నింట్లో సుకుమార్ డబ్బులు పెడతాడా.. ఆయన దగ్గర అంత డబ్బులున్నాయా.. సినీ నిర్మాణం ఎంతో రిస్కీగా మారిపోయిన ఈ రోజుల్లో ఈ లెక్కల మాస్టారు ఎందుకింత సాహసం చేస్తారు అని అనుమానాలు కలగడం సహజం.
ఐతే నిర్మాతగా సుకుమార్ లెక్కలు వేరు. ఆయన ఏ సినిమాలోనూ డబ్బులు పెట్టరు. తన బ్రాండును ఆయా సినిమాలకు వాడుతున్నందుకు, తన క్రియేటివ్ ఇన్ పుట్స్ తీసుకున్నందుకు ఆయన వాటా తీసుకుంటారు. అదే ఆయన పెట్టుబడి. సినిమా స్థాయిని బట్టి వచ్చే లాభాల్లో ఆయన షేర్ ఉంటుంది. చిన్న సినిమాలకు ఆయన 30 శాతం దాకా లాభాల్లో వాటా అందుకుంటారని సమాచారం.
అంటే వచ్చిన ఆదాయంలో ప్రొడక్షన్ కాస్ట్ మైనస్ చేసి వచ్చేదాంతో సుక్కు వాటా ఇస్తారు నిర్మాతలు. ఒక వేళ సినిమా హిట్ కాకపోతే సుక్కుకు ఏమీ రాదు. హిట్టయితే మాత్రం లాభాల్లో వాటా వస్తుంది. తాను దర్శక’త్వం వహించే చిత్రాలకు కూడా సుకుమార్ వాటానే తీసుకుంటున్నారు. పుష్ప’, పుష్ప’-2 చిత్రాలకు ఇదే జరిగింది. ఆ చిత్రాల ద్వారా ఆయన భారీగా ఆదాయం పొందారు.
సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండే చిన్న సినిమాల విషయంలో ఆయనకు ప్రతిసారి బాగానే వర్కవుట్ అవుతోంది. సుకుమార్ రైటింగ్స్ పేరు పడటంతోనే చిన్న సినిమాలకు ఈజీగా ఓటీటీ అవుతుంది. ప్రేక్షకులు కూడా నమ్మకంతో థియేటర్లకు వస్తారు. తద్వారా వాటికి లాభాలు ఖాయంగా వస్తాయి. బుచ్చిబాబు సానా తొలి చిత్రం ఉప్పెనకు తన బ్రాండుతో పాటు క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చినందుకు ఆయన భారీ లాభం పొందారు. పెద్ది సినిమాకు కూడా ఇలాంటి సహకారమే అందించారు.. ఆ చిత్రం సుక్కుకు అనుకున్నంతగా వర్కవుట్ కాలేదని సమాచారం.

