నీట్ పరీక్ష తేదీని విడుదల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు ప్రకటన చేసింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ-2026″ రీ-ఎగ్జామ్ జరగనుందని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్డీఏ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలతో…
ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలతో ఈ నెల 3వ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరిగి అభ్యర్థులు ఎవరూ ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, గతంలో చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇవ్వాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. మరొకసారి నీట్ ఎగ్జామ్ కు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది.

