నీట్ 2026 పేపర్ లీకేజీ సంస్థ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ.. ప్రముఖ వార్తా NDTV నిర్వహించిన ఒక సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా నడుస్తున్న ‘రేణుకై కెరీర్ సెంటర్’ డైరెక్టర్ శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్ మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ దొరకడంతో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెంటనే జరిగింది.. నాశిక్‌లోని అదే సంస్థకు చెందిన ఒక బ్రాంచ్‌లో ఎన్డీటీవీ ప్రతినిధి ఒక విద్యార్థి సోదరుడిగా నటిస్తూ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. కౌన్సెలింగ్ కోసం వచ్చినట్టు నమ్మించి అక్కడి బ్రాంచ్ మేనేజర్‌ను మాట్లాడినట్లు.. కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ కెమెరాకు చిక్కాయి.
ఆ వీడియో రికార్డింగ్‌లో నాశిక్ బ్రాంచ్ మేనేజర్ తమ సంస్థ సక్సెస్ రేటు గురించి గొప్పలు చెప్పుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. నీట్ పరీక్షల్లో అడిగే మొత్తం 180 ప్రశ్నలు తమ స్టడీ మెటీరియల్ నుంచే వచ్చాయనీ.. తమ వద్ద చేరితే విజయానికి 100 శాతం గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చాడు. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో కనీసం ఒక్క రేణుకై కెరీర్ సెంటర్ విద్యార్థి అయినా ఖచ్చితంగా ఉంటాడని దేశంలో ప్రగల్భాలు పలికాడు. దేశంలో మరే కోచింగ్ ఇన్స్టిట్యూట్కు ఇలాంటి ఫలితాలు రాలేదని, తమదే అత్యధిక పాస్ పర్సంటేజ్ అంటూ క్లెయిమ్ చేశాడు.
అంతటితో ఆగకుండా.. ఒక బుక్లెట్ చూపిస్తూ గత 2025 నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సైతం తమ మెటీరియల్‌తో ఎలా మ్యాచ్ అయ్యాయో వివరించాడు. రేపొద్దున ఏ తల్లిదండ్రులైనా వచ్చి ప్రూఫ్ అడిగితే.. నేరుగా తమ స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి పేజీ నంబర్, క్వశ్చన్ నంబర్‌తో సహా చూపించగలమని ఆ మెనేజర్ చెప్పుకొచ్చాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఏ సబ్జెక్టులోనైనా 180కి 180 ప్రశ్నలు తమ బుక్స్ నుంచే వస్తాయంటూ గుట్టు విప్పాడు. అయితే ఇదంతా డైరెక్టర్ శివరాజ్ మోతేగాంకర్ అరెస్ట్ అయిన సమయంలోనే బయటపడటం. 23న జరిగిన నీట్ పరీక్షకు ముందే సదరు డైరెక్టర్ ఒక గ్యాంగ్‌తో చేతులు కలిపి, లీకైన ప్రశ్నపత్రాన్ని, సమాధానాలను తన ఫోన్ ద్వారా సర్క్యులేట్ దర్యాప్తు సీబీఐ దర్యాప్తులో తేలింది.
మరోవైపు ఈ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాలను సైతం కుదిపేస్తోంది. ఈ నీట్-యూజీ లీకేజీ కేసుపై, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సమీక్షించేందుకు పార్లమెంటరీ కమిటీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఉన్న ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ పార్లమెంటరీ కమిటీ మే 21న అత్యవసర సమావేశం. ఈ సమావేశానికి హాజరుకావాలని ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీలకు సమన్లు జారీ చేసింది. కే రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన సంస్కరణల నివేదిక, పేపర్ లీక్‌పై జరుగుతున్న దర్యాప్తును ఈ కమిటీ పరిశీలించనుంది. మే 3న జరిగిన ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగిన సమాచారంతో.. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రద్దయిన పరీక్ష జూన్ 21న తిరిగి నిర్వహించబడుతుంది, వచ్చే ఏడాది నుండి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఫార్మాట్లోకి మారుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన ప్రకటన.

