నీట్ ప్రశ్నపత్రం కేసులో సీబీఐ అధికారులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం కేసులో కింగ్ పిన్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీలో కులకర్ణి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. తన ఇంట్లోనే కోచింగ్ సెంటర్ ను అయితే కులకర్ణిని అరెస్ట్ చేశారు. ఆయన తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు చెప్పినట్లు సీబీఐ ఆధారాలను సేకరించింది.
పూణెలో రిటైర్డ్ ప్రొఫెసర్ గా కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం తయారీలో పాత్ర పోషించిన కులకర్ణి ప్రశ్నపత్రం లీకేజీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన కోసం సీబీఐ గత కొన్ని రోజులుగా వెదుకుతుంది. చివరకు కులకర్ణి దొరకడంతో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.

