– ప్రకటన –
నవతెలంగాణ – కామారెడ్డి
నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు జిల్లా స్వీకరించిన ముకుంద్ రెడ్డి జై గౌడ్ ఉద్యమ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో జై గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక, సేవా కార్యక్రమాలను నూతన సూపరిండెంట్‌కు వివరించారు.
అనంతరం ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుంద్ రెడ్డి మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గం సంప్రదాయ వృత్తితో పాటు సమాజాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ సేవలను ప్రజలకు తగిన విధంగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. గౌడలను సంఘాల ప్రతినిధులు చేసే నిర్మాణాత్మక సూచన సానుకూలంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుందర్ సింగ్, జిల్లా జై గౌడ్ ఉద్యమం బాధ్యులు నర్సు గౌడ్, ఇతర నాయకులు ఉన్నారు.
– ప్రకటన –

