- నెదర్లాండ్స్లో కొనసాగుతున్న మోడీ పర్యటన
- నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ
- ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం యూఏఈలో కొనసాగుతోంది.. శనివారం నెదర్లాండ్స్లో కొనసాగుతోంది. ముందుగా భారతీయ సమాజాన్ని కలిసి కీలక ప్రసంగం చేశారు. అనంతరం నెదర్లాండ్స్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.

ఇక పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాను రాజభవనంలో కలిశారు. ఈ సందర్భంగా భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి.
ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”రాయల్ ప్యాలెస్లో రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలిశాను. సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, వాణిజ్యం, జల వనరులు వంటి కీలక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా అనిపించింది.” అని పేర్కొన్నారు.
అలాగే భారత్, నెదర్లాండ్స్ దేశాలు పరస్పర ప్రయోజనాలతో పాటు భవిష్యత్ తరాలకు అనుకూలమైన ప్రపంచ నిర్మాణం అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని మోడీ తెలిపారు. ఇక మోడీ సమక్షంలో టాటా ఎలక్ట్రానిక్స్, ASML ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “రాయల్ ప్యాలెస్లో కింగ్ విల్లెం-అలెగ్జాండర్ మరియు క్వీన్ మాక్సిమాను కలిశారు. సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధి, వాణిజ్యం మరియు నీరు వంటి కీలక రంగాలలో భారతదేశం-నెదర్లాండ్స్ మధ్య స్నేహాన్ని పెంపొందించడంలో ఇది అద్భుతమైన దృక్కోణాలను మార్పిడి చేసింది… pic.twitter.com/onZZuPgDzt
– ANI (@ANI) మే 16, 2026
#చూడండి | హేగ్, నెదర్లాండ్స్ | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో టాటా ఎలక్ట్రానిక్స్ మరియు ASML ఎంఓయూపై సంతకం చేశాయి.
(మూలం: ANI/DD) pic.twitter.com/P5e7G2DsVX
– ANI (@ANI) మే 16, 2026

