నేటి నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. అమర్ నాధ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో ముందు నుంచే భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.
భారీ భద్రత మధ్య…
అమర్ నాధ్ యాత్ర నెలల పాటు సాగనుంది. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతను మరింతగా పటిష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో అనంతనాగ్ జిల్లాలో హైఅలర్ట్ ను ప్రభుత్వం ప్రకటించింది. ప్రశాంత వాతావరణంలో అమర్ నాధ్ యాత్ర సాగేలా పక్కా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.

