నేటి నుంచి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీలో బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఈ విచారణ చేపట్టనుంది. మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది.
ఏపీ వాదనలు విన్నతర్వాత…
ఇప్పటికే తెలంగాణ వాదనలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలకు సంబంధించి తాగు, సాగునీటి అవసరాలపై తమ వాదనలను ట్రిబ్యునల్ ముందు పెట్టాల్సింది. మూడు రోజులపాటు విచారణ జరిపిన అనంతరం ట్రిబ్యునల్ తమ తీర్పును వెల్లడించనుంది.

