– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో కూటమి నేతలు సమావేశమై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన అంశాలు, సభల్లో సమన్వయంతో వ్యవహరించే విధానం, సమిష్టి పోరాట కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలు, కీలకమైన ఉమ్మడి స్వరంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఇండియా కూటమి కోరుతోంది.
– ప్రకటన –

