పోక్సో కేసులో బండి భగీరథ్ కు పోలీస్ కస్టడీకి నేడు తీసుకున్నారు. న్యాయస్థానం తీర్పుతో ఈరోజు జైలు నుంచి బండి భగీరథ్ ను పోలీసులు తమ కస్టడీకి విచారించనున్నారు. బండి భగీరథ్ ను మూడు రోజుల కస్టడీకి మేడ్చల్ కోర్టు అనుమతించింది. పోక్సో కేసులో బండి భగీరథ్‌ను విచారించేందుకు తమ కస్టడీకి పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు.
మూడు రోజులు విచారణ…
వారం రోజులు కోరగా, మూడు రోజులు మాత్రమే న్యాయస్థానం అనుమతించబడింది. మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి మూడు రోజుల పాటు బండి భగీరథ్ ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. ప్రస్తుతం బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి బండి భగీరథను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు.

