నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనలు తెలియజేయనున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై…
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని ఆరోపిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలను వ్యక్తం చేసింది.

