తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే మహానాడు తీర్మానాల కమిటీ రెండు రోజుల పాటు సమావేశమై మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలను ఖరారు చేశారు. ఈ తీర్మానాలపై నేడు పొలిట్ బ్యూరో చర్చించనున్నారు.
వర్చువల్ గా చంద్రబాబు…
ఉదయం పదకొండు గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సమావేశంలో వర్చువల్ గా పాల్గొంటారు. తీర్మానాలు, మహానాడులో నిర్వహించాల్సిన కార్యక్రమాలను మాత్రమే చర్చిస్తారు.

