వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును పోలీసులు హైదరాబాద్ కు తీసుకు వస్తున్నారు. నిన్న కాంచీపురంలో బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతంలో ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని కాజేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రాష్ట్రాలు తిరిగి బ్రహ్మనాయుడును చివరకు కాంచీపురంలో పట్టుకున్నారు.
నిన్న కాంచీపురంలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులునేడు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేయనున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట బ్రహ్మనాయుడును పోలీసులు హాజరుపరచనున్నారు. అయితే బ్రహ్మనాయుడు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించి తనను అరెస్ట్ నుంచి తప్పించాలని కోరినా ఊరట దక్కలేదు.

