ఆక్లాండ్: ప్రతిష్ఠాత్మక మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత మహిళా జట్టు-0 గోల్స్ తేడాతో చిలీని చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుదిపోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడుతోంది. షూటౌట్లో అమెరికాను ఓడించి కివీస్ ఫైనల్కు చేరుకుంది.
ఇక చిలీతో జరిగిన సెమీస్లో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆరో నిమిషంలోనే నవనీత్ కౌర్ జట్టుకు తొలి గోల్ సాధించింది. 13వ నిమిషంలో నవనీత్ మరో గోల్ నమోదు చేసింది. ఇక 14వ నిమిషంలో దీపిక భారత్కు మూడో గోల్ అందించింది. అంతేగాక 18వ నిమిషంలో దీపిక తన రెండో గోల్. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 40 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా భారత్ మరో రెండు గోల్స్ చేసింది. నేహా, రుతుజాలు ఈ గోల్స్ సాధించారు.

