తెలంగాణ:వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఓ వ్యవసాయ పొలంలో బంగారం లభించినట్లు ప్రచారం జరగడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ.పొలాన్ని దున్నుతున్న సమయంలో బంగారం దొరికినట్లు సమాచారం రావడంతో కౌలు రైతు,కూలీలు, మాజీ భూ యజమాని మధ్య వాటాల వివాదం మొదలైంది.
ప్రతాప్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతు బాలు, దున్నుతుండగా బంగారం లభించినట్లు తెలుస్తోంది.దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా తమకు వాటాగా డిమాండ్ చేస్తూ వివాదానికి దిగారు.
ఇదిలా ఉండగా,ఆరేళ్ల క్రితం ఈ భూమిని విక్రయించారు జైపాల్ రెడ్డి( జైపాల్ రెడ్డి ) కూడా ఈలోకి వచ్చి,తనకు కూడా వాటా ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.గతంలో కూడా ఇదే పొలంలో బంగారం దొరికిందనే ప్రచారం స్థానికంగా ఉండటంతో, ఈ భూమిలో మరిన్ని నిధులు ఉండొచ్చన్న ఆశతో రైతులు కౌలు తీసుకునే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
బంగారం లభ్యమైందన్న ప్రచారం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు.బంగారం లభించిన ఘటన, యాజమాన్య హక్కులు,వాటాల వివాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.

