విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ప్రదర్శన ఆప్టికల్ చైన్ లెన్స్ కార్ట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ నిరసనలో పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అదేవిధంగా వీరి నిరసన తెలిపిన రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు, శంకారపు జయ శ్రీ, వ్యాపారుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవికుమార్, కోటి వెంకటేష్, కిరణ్ వ్యాపారస్తులు, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షుడు కుళ్లాయప్ప, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్, ఆర్ఎస్పీ నాయకులు మంజుల నరేంద్ర, వామపక్ష నాయకులు సీపీఐఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సంఘీభావం తెలిపిన మాట్లాడుతూ స్థానిక ఆప్టికల్ వ్యాపారులు ధర్మవరంలో 200 కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాగే ఉద్యోగులు టెక్నీషియన్లు ఇతర అనుబంధ రంగాల వారితో కలిపితే 2000 మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పెద్ద ప్రసార సంస్థ ప్రవేశిస్తే చిన్న వ్యాపారాలు నిలబడలేక మూతపడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్న ఆప్టికల్స్ ఆదాయంతోనే మా పిల్లల చదువులు కుటుంబ జీవనం కొనసాగుతోందని తెలిపారు. అభివృద్ధి పేరుతో చిన్న వ్యాపారాలను నాశనం చేయడం సమంజసం కాదని, ప్రజా ప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత స్థానిక ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై అధికారులపై ఉందని వారు స్పష్టం చేశారు. కావున తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో లెన్స్ కార్టు ధర్మవరంలోకి రావాలని ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం మా నిరసన తెలిపిన వారు కూడా పేరుపేరున అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్టికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేష్, శ్రీకాంత్ రెడ్డి ,హరికృష్ణ, శివ, ఆసీఫ్, రాజు కొనసాగుతున్నారు.

