దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ.. తీసుకునేది తక్కువ
అధిక జిఎస్టి చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోంది
డీ లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని నేను మొదటి నుంచి చెబుతున్నా
మేము నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు
ప్రధాని మోడీ చేస్తున్న ఆలోచనకి వ్యతిరేకం
పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించకూడదని కోరుతున్నాం
బెంగుళూరులో ఓ ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ.. తీసుకునేది తక్కువ అని పేర్కొన్నారు. ఢిల్లీలో దక్షిణాది ఎంపీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారని, అలా చూడొద్దని తాము అంటున్నామని అన్నారు. బెంగళూర్‌లో శనివారం ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమకాలిన రాజకీయ పరిణామాలు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు అధిక జిఎస్టి చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని తాను మొదటి నుంచి ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే అని. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు అని కేంద్రాన్ని సూచిస్తుంది. తెలంగాణ, కర్ణాటకలో కూడా బిజెపి ఎంపీలు గెలిచారని.. కానీ, కేంద్ర కేబినెట్లో ప్రధాన మంత్రి పదవులు లేవు. తాము రిజర్వేషన్ల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని, ప్రధాని మోడీ చేస్తున్న ఆలోచనకి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మోడీ పొలిటికల్ ఫార్ములా వాడ దానికి అనుగుణంగా. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని తాము కోరుతున్నామని అన్నారు.
మహిళా రిజర్వేషన్ల రచయితలం మేమే..
రిజర్వేషన్ల రచయితలం తామే అని సిఎం రేవంత్‌రెడ్డి సాధించిన మహిళా. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని,ఆమె ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌ను ఓడించారని చెప్పారు. పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు గుర్తు చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మహిళా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, సోనియా గాంధీ నాయకత్వంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదించామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు ఉన్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వాళ్లు రాజకీయ క్రీడ ఆడారని, వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120 సీట్లకు పెరుగుతాయని చెప్పారు. ఇది సరైంది కాదు అని, దీనినే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయని, బిజెపికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణలో త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చామని, రెండు వారాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. గతంలో వారు రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చినట్లు భావించారు, తాను సేవ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధిగా పాలకులుగా భావించి సామాన్యుల గురించి అర్ధం చేసుకున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి చేసారు. 1969 మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం ప్రారంభమైంది, 2009లోనూ ఉద్యమం వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వరంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కెసిఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదని అన్నారు. తాను పిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాను, పాదయాత్ర చేశానని, ఆ సమయంలో యువత సమస్యను, వాళ్లను అర్ధం చేసుకున్నానని చెప్పారు. గతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా ఉన్నారని. ఇంజినీరు, డాక్టర్, ఇతర నియామకాలు చేసే వ్యక్తి ఓ ఆర్ఎంపీ డాక్టరా..? అని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునరావాస కేంద్రంగా ఉండకూడదు అని, అందుకే తాను యుపిఎస్సి ఛైర్మన్, ఇతర సభ్యులను కలిసి, వాళ్లతో చర్చించానని చెప్పారు.యుపిఎస్సి ఎలా పని చేస్తుందో తెలుసుకుని దానిని టిజిపిఎస్సిలో అమలు చేశామని వివరించారు.
ఐటి కన్నా బ్లూ కాలర్ ఉద్యోగాల్లోనే ఎక్కువ సంపాదన
ఏఐఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళనకర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా యువతలో నైపుణ్యం పెంచడానికి తెలంగాణలో అనేక చర్యలు తీసుకున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాత పాత సిలబస్‌తో మూస పద్ధతిలో కొనసాగుతున్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ఎటిసి)లుగా అప్లోడ్ చేసిన విషయాలు చెప్పారు. తాము బ్లూ కాలర్ జాబ్‌లు సృష్టిస్తున్నామని, అందుకే తాను ఎక్కువగా జర్మన్, జపాన్, సౌత్ కొరియా అందుబాటులో ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. వైట్ కాలర్ జాబ్‌ల స్థానంలో బ్లూ కాలర్ జాబ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ ఇంజినీర్ కన్నా బ్లూ కాలర్ జాబ్ చేసే వారు ఎక్కువ సంపాదిస్తున్నారని. ఆయా దేశాల్లో పని చేసే యువతకు జర్మన్, జపాన్, కొరియన్ భాషలు నేర్పిస్తున్నామని చెప్పారు. ఏఐతో వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయి.. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమగ్రాభివృద్ధికి రూపకల్పన చేసిన తెలంగాణ రైజింగ్ -2047 దర్శనికత, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగడానికి నిర్దేశించుకున్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రధానంగా రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్‌పై చర్చాగోష్టిలో సమగ్రంగా మాట్లాడారు. మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
కెసిఆర్‌ను మీడియా ప్రతినిధులను ప్రెస్‌మీట్‌కు పిలుస్తా
తాను ప్రతి పది రోజులకు ప్రెస్‌మీట్ నిర్వహించానని, జర్నలిస్టులుఅడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తా సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను నిర్వహించే ప్రెస్‌మీట్‌కు కెసిఆర్ మీడియా ప్రతినిధులను కూడా అనుమతిస్తానని అన్నారు.ఎంత ఆలస్యమైనా తాను జర్నలిస్టులతో మాట్లాడతానని చెప్పారు. ప్రజలతో అనుసంధానమైతేనే ఏదైనా అర్ధమవుతుందని, ప్రజలతో అనుసంధానం కావడమే ప్రజా జీవితంలో నిజమైన బలం అని. తాను జర్నలిస్టులను దూషించను అని, వారితో వాదించను అని, వ్యంగంగా మాట్లాడతానని అన్నారు. వాళ్లు వ్యతిరేకంగా రాసినా పట్టించుకోను అని, అందులో విషయం ఉంటే అధికారులతో మాట్లాడతానని చెప్పారు. తాను మీడియా ను బ్యాక్ఫీస్ సమాచారంగా చూస్తానని చెప్పాడు.
హిట్లర్ స్పూర్తిగా హైడ్రా పేరు పెట్టాం
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి హైడ్రా అని పేరు పెట్టడం వెనుక ఆంతర్యాన్ని సిఎం రేవంత్ రెడ్డి. హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ వర్డ్ అని, అది ఆయన కోర్ టీమ్ పేరు అని పేర్కొన్నారు. ఆ టీమ్ ఎవరినైనా అంతం చేయగలదు అని, అందుకే హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా పేరు పెట్టామని చెప్పారు. దీని వల్ల తమ రాష్ట్రంలో జలాశయాలు, చెరువులను ఆక్రమించేందుకు ఎవరూ దైర్యం చేయడం లేదని అన్నారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని. తమ ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ ఫోర్స్ అని పేర్కొన్నారు.
కులతత్వాన్ని నిర్మూలించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్
కులతత్వాన్ని నిర్మూలించాలని చెబుతూనే ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ రెసిడెన్షియల్స్‌ను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనితో కులతత్వాన్ని నిర్మూలించడానికి ఎటువంటి అంతరాలు అందరూ కలిసి ఉంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని.సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తమ రాష్ట్రంలో ఎస్సి వర్గీకరణ చేపట్టామని చెప్పారు. గుజరాత్ కూడా సుప్రీంకోర్టును అమలు చేయలేదని. 1931 తర్వాత దేశంలో కుల గణన చేపట్టలేదని..కానీ, తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టామని అన్నారు. ఉద్యోగులు, ఉన్నత వర్గాల పిల్లలు నర్సరీ, ఎల్‌కెజి, యుకెజికి వెళుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి మొదలుపెడుతున్నారు… దీన్ని మార్చేందుకు తాము ప్రీ స్కూల్స్‌ను ప్రవేశపెడతామని వివరించారు. తమ దగ్గర 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షల మంది పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. 12 వేల ప్రైవేటు పాఠశాలలు పిల్లల ఉంటే అందులో 35 లక్షల మంది ఉన్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హతలు ఉన్నా ప్రీ స్కూల్ లేకపోవడంతో పిల్లలు రావడం లేదని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లకు ట్రాన్స్పోర్ట్ ఆశాజనకంగా ఉందని, తాము కూడా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడంతో పాటు పిల్లలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని చెప్పారు.తమ టీచర్లను సింగపూర్‌తో పాటు ఇతర దేశాల అధ్యయనానికి పంపించామని అన్నారు.
నా రాజకీయ జీవితమంతా ప్రజల కోసం పోరాడాను
తన రాజకీయ జీవితమంతా ప్రజలు, సామాన్యుల కోసం పోరాడానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు అని, ఎటువంటి మద్దతు లేదని అన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, తన తండ్రి పోలీస్ పటేల్ అని, తమ వ్యవసాయ కుటుంబం అని చెప్పారు. కష్టించే పనితత్వం… తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. విద్యార్థిగా విద్యార్థి పరిషత్‌లో పని చేశానని, తర్వాత వ్యాపారం చేశానని అన్నారు. 2006 జులైలో ఇండిపెండెంట్ జెడ్పిటిసి సభ్యునిగా గెలిచానని, 2007లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గానే ఎంఎల్‌సిగా గెలిచానని చెప్పారు. తర్వాత టిడిపి పార్టీలో చేరానని, పదేళ్లు చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశానని అన్నారు. రెండు సార్లు ఎంఎల్ఎగా గెలిచానని, రాష్ట్ర విభజన, స్థానిక కారణాలతో తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.
కెసిఆర్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం కావాలని ప్రజలు భావించారని, దాంతో తాను టీడీపీకి రాజీనామా చేశానని అన్నారు. ఆ సమయంలో తన ఎదుట ఎన్నో మార్గాలున్నాయి.. కానీ,తాను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వివరించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అన్ని విషయాలు రాహుల్ గాంధీకి తెలియజేశానని చెప్పారు. 2018 డిసెంబరు ఎన్నికల్లో తాను ఓడిపోయానని, మూడు నెలల తర్వాత దేశంలోనే అతి పెద్దదయిన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచానని చెప్పారు. తర్వాత తాను పిసిసి అధ్యక్షుడుని, ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. 2026 జులైతో తన ప్రజా జీవితం 20 ఏళ్లు పూర్తవుతుందని.

