చాలామంది బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా పర్స తీసుకెళ్తారు. షాపింగ్ చేసినప్పుడు పర్సు తీసి డబ్బులు ఇస్తుంటారు. అదే మహిళలైతే హ్యాండ్ బ్యాగ్లో చిన్న పర్సు పెట్టుకుంటారు.ప్రస్తుతం ఊహించని ఖర్చులతో పర్సు ఖాళీగా ఉంటుంది. సంపాదించిన డబ్బును పర్స్ లో పెట్టడం తోనే వచ్చినట్టే వచ్చి వెంటనే ఖర్చవుతుంది. అయితే పర్స్ ఎప్పుడూ నోట్ల కట్టలతో కళకళలాడుతూ ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. .!
వాస్తు మరియు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం బయటకు వెళ్లేటప్పుడు డబ్బులను పర్స్ లో తీసుకొని వెళతాము. పర్స్ నోట్లతో కళకళలాడుతూ ఉంటే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్టే. మరి లక్ష్మీదేవిని భద్రపర్సులో ఎప్పుడు నోట్లు ఉండాలంటే పండితులు తెలిపిన వివరాల ప్రకారం పర్సులో ఒక చిన్న వస్తువు ఉండాలి. అలాంటి వస్తువు ఉంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
దృష్టి లోపాలున్నా.. నరదృష్టి ఉన్న మీ పర్సులో లక్ష్మీదేవి ఉండదు. మీరు ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇలాంటి దోషాలతో బాధపడే వారికి రావి ఆకు చక్కటి పరిష్కారమని పండితులు చెబుతున్నారు. శనివారం కానీ.. మంగళవారం కానీ ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య కాలంలో.. రావి చెట్టు మొదట్లో ఆవు నేతితో దీపారాధన చేసి.. లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయాలి. ధూప.. దీప.. నైవేద్యాలు సమర్పించాలి. పూజ చేసే సమయంలో కొన్ని ఆకులు రాలుతాయి. అలాంటి వాటితో శుభ్రమైన ఆకును తీసుకొని దానిపై గంధంతో శ్రీ అని రాసి .. దానిని పర్సులో పెట్టుకోవాలి. ఆకు ఎండిన తరువాత మార్చాలి. ఇలా చేస్తే దృష్టి దోషాలు తొలగి.. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
హిందువులు దాదాపు అందరి ఇళ్లలో పూజ చేస్తారు. పూజలో పసుపు, కుంకుమ, పూలతోపాటు అక్షింతలు కూడా ఉపయోగించబడతాయి. అక్షింతలు అంటే బియ్యం.. పసుపు కలిసినవి. ఈ ధాన్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే దేవాలయాలకు వెళ్లినప్పుడు.. శిరస్సుపై పండితులు అక్షింతలు వేస్తారు. పూజలో ఉపయోగించిన అక్షింతలను (11 లేదా 21) ఎర్రటి పేపర్లో పాక్ చేసి మీ పర్సులో ఉంచుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది… అవసరపు ఖర్చులు తగ్గుతాయి.
ఆధ్యాత్మిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ మహాలక్ష్మికి సువాసన అంటే చాలా ఇష్టం.. అందుకే లక్ష్మీదేవి పూజలో గంధం.. సెంటుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. పచ్చ కర్పూరం చాలా మంచి వాసన ఉంటుంది. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం.. పర్సులో పచ్చకర్పూరాన్ని ఆకుపచ్చ పేపర్లో చేసి పాక్పర్స్లో పెట్టుకుంటే ఐశ్వర్యం ఆకర్షితుడయ్యేలా పచ్చకర్పూరం డబ్బును ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు.
పర్స్ సైజును బట్టి చిన్న వెండి నాణెం.. వినాయకుడి చిత్రం ఉంచడం శుక్రుడి బలం పెరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. శుక్రుడు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు. ఇది మీపర్సులోఉండటం వలన జాతకంలో శుక్రదోషాలు తొలగేందుకు అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
నిరాకరణ: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించారు. ఈ జాబితా V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించారు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

