పల్నాడు జిల్లాలో ఖైదీ పరారయ్యాడు. సత్తెనపల్లి సబ్ జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ అయ్యాడు. సబ్ జైల్లోని పెట్రోల్ బంక్లో శ్రీనివాసరావు అనే ఖైదీ పరారయ్యాడు. నిన్న సాయంత్రం డ్యూటీ నుంచి పరారైన ఖైదీ కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
హత్య కేసులో నిందితుడు…
గుంటూరులో జరిగిన హత్య కేసులో శ్రీనివాసరావు నిందితుడు. జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం పోలీస్ స్టేషన్లో స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీనివాసరావు సన్నిహితులు, బంధువుల ఇళ్లలో తలదాచుకునే అవకాశం ఉందని భావించారు.

