జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్, ఇమేజికి తాము ఏమీ భయపడడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఆవిష్కరణ రోజు పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభ కోసం పోలీసుల ముందు అనుమతి కోరితే, శాంతిభద్రతల సమస్య వస్తుందని,పైగా ఆ హాలు చిన్నగా ఉన్నదని భావించి అనుమతి ఇవ్వలేదని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య వైషమ్యాలు చెలరేపే కుట్ర ఆయన కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కలిపి పవన్ కళ్యాణ్‌ను బలి చేయవద్దు, పవన్‌కి రాజకీయం ఏమి తెలియదని అన్నారు. బిజెపికి అనుకూలంగా పవన్ మారారని ఆయన అన్నారు. చేగువేరా వారసుడిగా ఉండి హిందూ ధర్మాన్ని నమ్మడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌ను బిజెపి పావుగా వాడుకుంటోందని ఆయన. ధాన్యం కొనలు చేయడానికి కేంద్రంపై వత్తిడి తెచ్చే సత్తా బిజెపి రాష్ట్ర నాయకులకు గానీ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు గానీ లేడని ఆయన. తెలంగాణ సెంటితో బిఆర్ఎస్ను పెద్దగా ఎంపిక కార్యక్రమం ఆయన ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండటం మీకు ఇష్టం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత వాతావరణం ఉండాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ ఆత్మగౌరం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిజెపి నేతలకు ఆత్మగౌరవం లేదని ఆయన చెప్పారు.ఎపి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు తాము గౌరవం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
కొండగట్టు యాత్రకు, వారాహి యాత్రకు అన్ని పర్మిషన్ లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సమావేశం లక్ష్యం ఎవరి కోసం..? ఎందుకు కోసమో తెలుసుకోవాలి. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచే వచ్చి ఉన్నారు. తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి కొట్లాడిన ఉద్యమ గడ్డ తెలంగాణ త్యాగాలను స్మరణం చేసుకోవాలని అద్దంకి చెప్పారు.

