తెలంగాణలో నేడు పవన్ కల్యాణ్ సభపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటికే సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తమ సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని భావించి పోలీసులు నిరాకరించారు.
కోర్టు అనుమతి…
అయితే తమ సమావేశాలను కోర్టు అనుమతిస్తుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప పేరుతో సభ ఏర్పాట్ల కోసం తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. జనసేన కార్యకర్తల కోసం అనుమతి ఇచ్చారు.

