పవన్ కళ్యాణ్: తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులంతా ఆసక్తి చూపుతున్నారు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు కూడా తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల అతన్ని టాప్ లెవల్లో నిలబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన తర్వాత కూడా రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో పాటు మరొక ఇద్దరు దర్శకులతో కూడా అతను పని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక తమిళ దర్శకుడు ఆయనకి కథ వినిపించాడట.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే జైలర్ సినిమాతో సక్సెస్ ను సాధించిన నెల్సన్ కావడం విశేషం…అయన కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి ఒక కథనైతే వినిపించారట. ఆయన ప్రస్తుతం రజినీకాంత్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ లను పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఒక కథ చెప్పాడట. సోషల్ మెసేజ్ ఉన్న కథ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి కథల్లో మార్పులు చేర్పులు చేస్తాడా లేదంటే కథని అలాగే ఉంచుతాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ కాబట్టి త్రివిక్రమ్ ఆ కథలోని లోటు పాట్లను చూసి పవన్ కళ్యాణ్ కి మరోక నరేషన్ కూడా ఇస్తాడు. అది కూడా కన్ఫర్మ్ అయితే నెల్సన్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది. లేకపోతే ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…

