పవన్ కళ్యాణ్ అటవీ శాఖ: ఎవరికైనా మంత్రి పదవి పొందితే రెండవ మాటకు తావు లేకుండా అవకాశం వైపు చూస్తారు. అవకాశం ఉంటే ఫైనాన్స్ లేదా ఎనర్జీ.. వంటి శాఖలను తీసుకుంటారు. ఎందుకంటే వాటిలో ఉండే సౌలభ్యం వేరు.. సంపాదించుకునే మార్గం వేరు.. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత.. ఆయన ఏరి కోరి పర్యావరణ శాఖను తీసుకున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు తాను ఆ శాఖను తీసుకోవడం వల్ల ఏం చేస్తానో కూడా చేసి చూపిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల పుణ్యస్నానాలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రంలో గోదావరి విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నది చుట్టుపక్కల కాలుష్యకారక పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆ పరిశ్రమలు పెద్ద వ్యక్తుల చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద దృష్టి సారించారు. అదే కాదు తన పార్టీకి చెందిన మంత్రి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలు ఈ స్థాయిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారంటూ.. ఈ పరిశ్రమలు త్వరలో మూతపడే అవకాశం ఉంది. గోదావరి ఊపిరి పీల్చుకునే సుముహూర్తం దగ్గరలోనే ఉంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ వల్ల సాధ్యమైంది.
పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉమ్మడి చిత్తూరులో ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కు పాదం మోపాలంటే ఏం చేయాలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సహాయశాఖ సిబ్బందికి ఆయుధాలు.. ఇతర సామాగ్రి సంబంధిత ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరికొద్ది రోజుల్లో నిధులశాఖ సిబ్బందికి అత్యంత ఆధునికమైన ఆయుధ సామాగ్రి చేతికి వస్తుంది. దీనివల్ల ఆపత్కాలంలో వారికి ఆయుధాలు రక్షణగా ఉపయోగపడతాయి . అంతేకాదు స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పడుతుంది.
వీటితోనే పవన్ కళ్యాణ్ ఆగిపోలేదు.. ఏపీలో విస్తారంగా ఉన్న అడవుల్లో జంతువుల వేట ఇష్టానుసారంగా సాగుతూ ఉంటుంది. వేటగాళ్లు అడవుల్లో ఉచ్చులు బిగిస్తుంటారు. ట్రాప్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో చిక్కుకున్న జింకలు.. కుందేళ్లు.. దుప్పులు.. వంటి జంతువులను వధించి.. వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు.. ఈ జంతువులను విక్రయించడం వల్ల అడవుల్లో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటోంది. అందువల్ల పులులు.. ఇతర క్రూర మృగాలు ఆహారం లభించకుండా జనావాసాల్లోకి వస్తున్నాయి.
ఆ మధ్య రాజమండ్రిలోకి ఒక పులి వచ్చింది. చాలా రోజులపాటు ఆ ప్రాంతం లోనే అది తిరిగింది. చివరికి శాఖ అధికారులు పట్టుకోవడంతో రాజమండ్రి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. అయితే ఈ అడవి జంతువులను వేటాడే వేటగాళ్లకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సూచనలు చేస్తున్నారు. ఈ నివారణశాఖ అధికారులు రంగంలోకి దిగి.. అడవుల్లో ఉన్న ఉచ్చులు.. ఫుల్ ట్రాప్లు.. కరెంటు తీగలను తొలగించారు.
హనుమాన్ ఫౌండేషన్ శాఖ అధికారులు సహకరించారు. రంపచోడవరం ప్రాంతంలో దుండగులు భారీ ఎత్తున ఉచ్చులు ఏర్పాటు చేశారు. రాహుల్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు క్షేత్రస్థాయిలోని శాఖ అధికారులు మూడు రోజుల పాటు శ్రమించారు. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులను, 10 ఫుల్ ట్రాప్లను, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న విద్యుత్ తీగలను తొలగించారు..
వీటిని తొలగించడం వల్ల ఎన్నో జంతువులు బతికి బట్టకట్టాయి.. ఇవి కేవలం ఉన్నాయి.. ఇలాంటి ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎందుకంటే పచ్చని అడవి బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. అడవి ఎండిననాడు మనిషి బతుకు ఎడారి అవుతుంది.

