జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ క్యాంపులో జరిగిన ఈ భేటీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీలో అరవ శ్రీధర్… జనసేన విప్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పదవికి రాజీనామా చేసిన శ్రీధర్.. రాజీనామా పత్రాన్ని పవన్ చేతిలో పెట్టారు. ఇందుకోసమే ఆయన పవన్ ను కలిసినట్టుగా సమాచారం.
పనిలో పనిగా… తనపై వచ్చిన ఆరోపణలకు సంబందించిన శ్రీధర్… పార్టీ అధినేతగా ఉన్న పవన్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. శ్రీదర్ ఇచ్చిన వివరణను పవన్ అంగీకరిస్తారా? లేదా? అన్న పరీక్ష పక్కనపెడితే… విప్ పదవికి శ్రీధర్ రాజీనామా చేసినప్పటికీ పవన్ ఆమోదించారు. ఫలితంగా శ్రీధర్ కు పార్టీ అందించిన విప్ పదవి ఊడిపోయిందని చెప్పాలి. మరో జనసేనకు చెందిన మరో నేతకు కొత్తగా అవకాశం దక్కినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కున్న శ్రీధర్.. ఆ మహిళ ఓపెన్ అవ్వడంతో అడ్డంగా బుక్కయ్యారు. విడతలవారిగా సదరు మహిళ శ్రీధర్ కు సంబందించిన వీడియోలను విడుదల చేయడంతో పాటుగా తనకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తాజాగా ముస్లిం మహిళల పట్ల శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా బాధిత మహిళ విడుదల చేయడంతో శ్రీధర్ మరింతగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఫలితంగా విప్ పదవికి ఆయన రాజీకాయ చేయవలసి వచ్చింది.
వాస్తవానికి శ్రీధర్‌పై వేగంగా స్పందించిన పవన్ కల్యాణ్… ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక అందిన తర్వాత విప్ పదవికి రాజీనామా చేయడం పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిందని… ఆ మేరకే శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

