ట్రంప్ ఆగ్రహం, దాడులు ఆపాలని వార్నింగ్
సరేనన్న ఇరాన్.. లెబనాన్‌పై మళ్లీ దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక
దుబాయి : కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న నేపథ్యంలో అమెరికా దాడులు నిలిపివేయాలని ఇరుపక్షాలకు గట్టి సందేశాన్ని ఇస్తున్నా ఇరాన్, ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. లెబనాన్‌పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ కూడా ఇందుకు దీటుగా స్పందించింది. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలే లక్షంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తిరిగి ఏర్పడింది.
ఇరాన్‌లోని ఇష్ఫహాన్, కరాజ్, తబ్రిజ్, టెహ్రాన్‌లో భారీ ఎత్తున దాడుల శబ్దాలు వినపడినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇమామ్ ఖోమేనీ అంతర్జాతీయ విమానశ్రయంలో సర్వీసులు నిలిపివేసినట్లు తెలిసింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని రెండు ప్రధాన మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించారు. మరోవైపు తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
ఇరు పక్షాలు తక్షణమే దాడులు ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. తాము దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో మళ్లీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరిగితే ఊరుకునేది లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. యుద్ధం నుంచి కానీ, శాంతి చర్చల నుంచి కానీ తాము వైదొలగలేదని ఈ రెండు తమకు ప్రాధాన్య అంశాలేనని స్పష్టం చేశారు.
భారత్ ఆందోళన.. పౌరులకు హెచ్చరిక
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పరస్పర అంతర్జాతీయ దాడులు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఇరుపక్షాలు ఉద్రిక్తతలు తగ్గించుకుని చర్చల ద్వారా బాటలో పయనించాలని విదేశాంగ శాఖ సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రదర్శించబడింది. 100 రోజులకుపైగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయపడింది.
పశ్చిమాసియాలో తిరిగి శాంతి, స్థిరత్వం, సౌభ్రాతృత్వం కోసం చర్చలు కొనసాగుతున్నాయి, త్వరలో ముగింపు పలకాలని ఇరు పక్షాలను భారత్ కోరింది. మరోవైపు ఇరాన్లో భారతీయ పౌరులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. వీలైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇళ్లకు పరిమితం కావాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తిరిగిరావడమే మంచిదని, దౌత్యకార్యాలయ సూచనలు పాటించాలని.

