పసుపు రైతుల పట్ల మార్కెట్ యార్డు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో వ్యాపారులు కుమ్మక్కై కొనుగోళ్లను నిలుపుదల చేశారు. టెండర్లు ధర ప్రకారం రైతులు, అధికారులు కొనుగోలు చేయాలని వ్యాపారులకు చెప్పడంతో వ్యాపారులంతా కూడబలుకొని పసుపు కొనుగోలు చేయకుండా వెళ్లిపోయారు.
వ్యాపారులతో కుమ్మక్కై…
కొనుగోలు నిలిచిపోవడంతో దూర ప్రాంతం నుంచి పసుపు తీసుకొచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసుపు ధర బాగుందని మంచి లాభాలు వస్తాయని రైతులు తెలిపారు. వ్యాపారుల నిర్వాకంతో పసుపు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాగా పండిన పంటను ప్రభుత్వం సూచించిన ధరకు కాకుండా వారికి నచ్చిన ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులు చూస్తున్నారని రైతుల డిమాండ్ చేస్తున్నారు.

