ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో బస్సు లోయలో పడి 40 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున బలోచిస్థాన్-ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల మధ్య రాసర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిథి షాహిద్ రింద్ తెలిపారు.
క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా.. మార్గ మధ్యలో మరో బస్సు బ్రేక్ డౌన్ అయింది. అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారని షాహిద్ తెలిపారు. తప్పిపోయిన బస్సు లోయలోకి పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

