పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్: పాకిస్థాన్ ప్రధానమంత్రి షరీఫ్.. ఆర్మీ చీఫ్ మునీర్ కు రోజులు బాగున్నట్టు లేవు. అమెరికాతో అంటకాగుతున్న వారికి పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాతో ఇంకా ఎక్కువ రెచ్చిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సంకేతాలు పంపించారు. అమెరికా వద్ద పాకిస్తాన్ ప్రయోజనాలను తాకట్టు పెడితే పరిణామాలు తీవ్రంగా మారుతాయి అని స్పష్టం చేసింది. దీంతో పాకిస్థాన్ ప్రధానమంత్రి కి.. ఆర్మీ చీఫ్ కు భయం పట్టుకుంది.
అబ్రహం అకార్డ్స్‌లో ఇజ్రాయిల్ దేశాన్ని కూడా గుర్తించాలని అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకువస్తుంది.. అంతేకాదు ఇజ్రాయిల్‌తో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని సూచిస్తుంది.. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. ఇస్లాం దేశాలు మొత్తం ఇజ్రాయిల్‌తో వ్యాపారం నుండి మొదలుపెడితే దౌత్యం వరకు అన్ని విషయాలలో మెరుగైన సంబంధాలు పాటించాలని అమెరికా చెబుతోంది. పాకిస్తాన్ మాత్రం ఎటువంటి విషయాన్నీ బయటకి వెల్లడించడం లేదు. నిశ్శబ్దంగా ప్రస్తుతం కనిపిస్తున్న తీరు పట్ల ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా స్పందించింది.. అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలవంచితే.. అప్పుడు జరిగిన పరిణామాలు అంతకుమించి అనేవి.
ఇటీవల కాలంలో మధ్య ప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య చోటుచేసుకున్న యుద్ధాన్ని తగ్గించేందుకు దాయాది దేశ చర్చలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. అయితే ఇంతవరకు రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా రెండు దేశాలు పరస్పరం దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగానే అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి పాకిస్తాన్ దేశానికి మింగుడు పడనివ్వడం లేదు. ఒకరకంగా పాకిస్తాన్ పరిస్థితి కుడితి లో పడిన ఎలుక వంటి ఉంది. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగడంతో పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా భయపడుతున్నారు. ఒకవేళ అమెరికా విధించిన షరతులకు ఒప్పుకోకపోతే అంతర్జాతీయంగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఉగ్రవాదులను కాదని ముందడుగు వేస్తే బతికే పరిస్థితి ఉండదు.
ఒకవేళ ఉగ్రవాద సంస్థలకు తిక్క రేగితే పాకిస్థాన్ దేశంలో ఏదైనా చేస్తారు. పాకిస్తాన్ దేశం మీద అక్కడి ఆర్మీ కంటే కూడా ఉగ్రవాద సంస్థలకే పట్టు ఎక్కువగా ఉంటుంది. పైగా రాత్రికి రాత్రే వారు ప్రభుత్వాలను మార్చగలరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దలను బహిరంగంగా చంపగలరు. అందుకే మునీర్.. షరీఫ్ ఉగ్రవాదులు అంటేనే భయపడుతున్నారు. మరి ఈ భయం నుంచి వారికి అమెరికా రక్షణ కల్పించగలదా.. అమెరికాను కాదని వారు నిర్ణయాలు తీసుకోగలరా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

