గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ జాదుమణి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 55 కేజీల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఈ 22 ఏళ్ల మణిపూర్ బాక్సర్ 5-0తో పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో భారత్‌కు పతక ఆశలు రేకెత్తించాడు. అయితే ఈ పోరు కార్గిల్ విజయ్ దివస్ నాడు జరగడంతో ఈ విజయాన్ని జాదుమణి కార్గిల్ హీరోలకు అంకితం చేశాడు.
ఈ విజయనంతరం మాట్లాడిన అతను పాక్‌పై విజయం సాధించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. ‘మన కార్గిల్ హీరోలకు నా విజయం అంకితం. పాకిస్థాన్ బాక్సర్‌ను ఓడించినందుకు సంతోషంగా ఉంది.. గర్వంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నించవచ్చు. భారత్‌కు బంగారు పతకం అందించడమే నా లక్ష్యం’ అని జాదుమణి చేర్చాడు.
1999 కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది జులై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజునే జాదుమణి విజయం సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. తొలి రౌండ్లో బై దక్కడంతో పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్ నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. కానీ భారత బాక్సర్ దెబ్బకు చిత్తుగా ఓడాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బాక్సర్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు భారత్ నాలుగు పతకాలను గెలుచుకుంది. పారా పవర్ లిఫ్టింగ్‌లో జాండు కుమార్ కాంస్య పతకంతో తొలి మెడల్ అండించగా.. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను బంగారు పతకం గెలిచింది. పురుషుల 65 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో ముతుపండి రాజా సిల్వర్ మెడల్ సాధించాడు. బాక్సింగ్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది.
కథనం మొదట ప్రచురించబడింది: సోమవారం, జూలై 27, 2026, 12:06 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 27, 2026

