ఎస్ఎఫ్ఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; నగరంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు, ముందస్తు ప్రచారాలు నిర్వహించడం, పుస్తకాలు, యూనిఫారాలు, షూస్ పేరుతో తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా పట్టణంలోని పలు పాఠశాలలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రచారాలను నిర్వహించడం ఖండిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖాధికారి DEO కిష్టప్ప న ధర్మవరం పట్టణంలో ఉప విద్యాశాఖ అధికారి విచ్చేసిన వారికి వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ
ధర్మవరం పట్టణంలోని పలు పాఠశాలల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారికంగా విద్యాసంవత్సరం ప్రారంభించక ముందే, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ల పేరుతో బోర్డులు పెట్టి ప్రచారాలు సాగిస్తూ, విద్యాశాఖను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల కిరణాలను నిషేధించాలి* బయట మార్కెట్ ధర కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు పుస్తకాలు, నోట్స్, యూనిఫాం, షూస్ మరియు బెల్టు, ప్యాడు డైరీ వగైరా వగైరా స్పెషల్ పుస్తకాలు అంటూ వేలాది రూపాయలు దండుకుండే ఈ పుస్తకాల వ్యాపారం ద్వారా ఒక్కో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ. 15వేల నుండి 20 వేల వరకు అక్రమంగా గుంజుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్కూళ్లలోనే వస్తువులు కొనాలని చెబుతున్నారు , లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని. ఈ కార్యక్రమంలో బాలాజీ, దామోదర్ ఉన్నప్పుడు.

