IPL 2026 ప్లేఆఫ్‌లు: ఐపీఎల్ (IPL 2026) ప్లేఆఫ్స్ పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం (2026, మే 24న) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)పై రాజస్థాన్ రాయల్స్ (RR) దంచికొట్టడంతో ప్లేఆఫ్స్ చేరే ఆఖరి టీమ్ గా నిలిచింది. రాయల్స్ ఈ మ్యాచ్ గెలవడంతో 16 పాయింట్లతో అధికారికంగా టాప్-4లో ఎంట్రీ ఇచ్చింది. దీనితో 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీతో ఆడుతున్న చివరి మ్యాచ్‌లో కేకేఆర్ (KKR) జట్ల ప్లేఆఫ్స్ ఆశలు గంగపాలయ్యాయి.
పాపం పంజాబ్ కింగ్స్:
ముంబై తాను మునుగుతూ ఈ కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ఇంటికి తీసుకెళ్లింది. ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో చూస్తే.. ముంబై 9వ స్థానంలో నిలవగా, లక్నో సూపర్ జైంట్స్ (LSG) ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ రెండు టీమ్‌లు ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి ఘోరంగా విఫలమయ్యాయి.
మే 26న క్వాలిఫైయర్ 1(ధర్మశాల):
పాయింట్ల పట్టికలో టాప్-1,-2 లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మే 26వ తేదీన ధర్మశాల వేదికగా క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ డైరెక్ట్‌గా మే 31న అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఇక ఓడిపోయిన టీంకు ఇంకో ఛాన్స్ ఉంటుంది. వాళ్లు ధర్మశాల నుంచి న్యూ చండీగఢ్‌కు జర్నీ చేసి అక్కడ క్వాలిఫైయర్-2 ఆడాల్సి ఉంటుంది.
►ఇంకా చదవండి |ముంబై ఖేల్ ఖతం.. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్
మే 27న ఎలిమినేటర్: ( – న్యూ చండీగఢ్):
పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో నిలిచిన మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మే 27న న్యూ చండీగఢ్‌లో ‘ఎలిమినేటర్’ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ పక్కా ‘డూ ఆర్ డై’ లాంటిది.. ఇందులో ఓడిపోయిన టీం ఇంటికి పోవాల్సి (టోర్నీ నుండి అవుట్) ఉంటుంది. గెలిచిన టీమ్ మాత్రం క్వాలిఫైయర్-2 కు వెళ్తుంది.
మే 29న క్వాలిఫైయర్–2 (న్యూ చండీగఢ్):
క్వాలిఫైయర్-1 లో ఓడిపోయిన టీమ్‌కు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌కు మధ్య మే 29వ తేదీన న్యూ చండీగఢ్‌లోనే క్వాలిఫైయర్-2 పోరు జరుగుతుంది. ఇందులో గెలిచినోళ్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
మే 31న గ్రాండ్ (అహ్మదాబాద్ ఫైనల్):
క్వాలిఫైయర్-2 మ్యాచ్ ముగిసిన వెంటనే గెలిచిన టీమ్ మే 30న అహ్మదాబాద్‌కు ప్రయాణం అవుతుంది. ఇక మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్-1 విజేతతో ఈ టీమ్ ఐపీఎల్ 2026 ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
4️⃣ జట్లు. 1️⃣ విజేత
అన్ని రహదారులు అంతిమ వైభవానికి దారితీస్తాయి 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 24, 2026
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “పాపం పంజాబ్! ఇంటికి వెళ్తూ వెళ్తూ కేకేఆర్, శ్రేయస్ సేనని కూడా తీసుకెళ్లిన ముంబై!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

