నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్లోని అమృత్సర్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైపాల్ సింగ్ బాహుపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. గురువారం మధ్యాహ్నం పార్కింగ్ వివాదంతో మొదలైన గొడవ తీవ్రమై, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో జైపాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్ట్ పార్కింగ్ విషయంలో గొడవ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై కాల్పులు మొదట కనిపించింది నవతెలంగాణ.

