ఈ రోజుల్లో ఖాళీ సమయం దొరికితే చాలు చాలా మంది ఫోన్లలో సోషల్ మీడియా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ, కొందరు తమకు ఉన్న చిన్నపాటి అలవాట్లను లేదా హాబీలను అదనపు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అలా కుక్కలపై ఉన్న ప్రేమను ఒక లాభదాయకమైన బిజినెస్‌గా మార్చి, నెలకు లక్షలు సంపాదిస్తూ అందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ఆ విశేషాలు చూద్దాం..
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్: న్యూయార్క్‌కు చెందిన కోబీ గుడ్‌హార్ట్ వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. రోజూ ఆఫీస్ పనితో ఉండేవాడు, తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సరికొత్తగా వాడుకోవాలని అనుకున్నాడు. తనకు కుక్కలన్నా, వాటితో గడపడమన్నా చాలా ఇష్టం. ఇక ఆ ఇష్టాన్నే పెట్టుబడిగా పెట్టి, పార్ట్ టైమ్‌లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే పనిని వ్యాపారంగా ప్రారంభించాడు.
టైమ్ మేనేజ్మెంట్తో భారీ ఆదాయం: కోబీ తన రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ పనిని ప్లాన్ చేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం పూట, ఆఫీసులో లంచ్ బ్రేక్ దొరికినప్పుడు, అలాగే శని, ఆదివారాల్లో వీకెండ్స్ దొరికినప్పుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తుంటాడు. ఇక అతను ప్రత్యేకంగా ‘గుడ్‌హార్ట్ డాగ్ కో’ అనే పెట్-కేర్ సంస్థను కూడా స్థాపించాడు. ఇలా చేస్తూ అతనికి ఏకంగా 6,000 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ.5.72 లక్షలకు పైగా నెలకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు.
నేటి యువతకు ఇదొక గొప్ప స్ఫూర్తి: ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువతీ యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు, లేదా ఉన్న ఉద్యోగంలో వచ్చే జీతం చాలడం లేదని నిరాశ పడ్డారు. మరికొందరైతే స్మార్ట్ఫోన్లలో పడి విలువైన, జీవితంలో వచ్చే ఎన్నో మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. ఇక అలాంటి వారందరికీ కోబీ గుడ్‌హార్ట్ కథ ఒక కనువిప్పు లాంటిది. మనసుకు నచ్చిన పనిని నమ్ముకుంటే పార్ట్ టైం జాబ్‌తో కూడా అద్భుతాలు సృష్టించారని అతను నిరూపించాడు.
సమయాన్ని వృథా చేయకుండా, వినూత్నంగా ఆలోచిస్తే ఏ రంగంలోనైనా రాణించటానికి ఈ కథ అర్థమవుతోంది. విదేశాల్లోనే కాదు, ఇప్పుడు మన దేశంలో కూడా మెట్రో నగరాల్లో ఇలాంటి పెట్-కేర్ సేవకు మంచి డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఉద్యోగం మీదే ఆధారపడకుండా, ఇలాంటి క్రేజీ ఐడియాలతో అదనపు ఆదాయం సంపాదించుకోవడం నేటి కాలంలో ఎంతో అవసరం.
ఇక ఏదైనా సైడ్ బిజినెస్ లేదా పార్ట్ టైం పనిని ప్రారంభించేటప్పుడు, చేస్తున్న ప్రధాన ఉద్యోగానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అలాగే ఆయా కంపెనీల నిబంధనలకు (మూన్‌లైటింగ్ విధానాలు) లోబడి ఉండేలా జాగ్రత్తపడడం చాలా ముఖ్యం.

