తెలంగాణ:పాలకుర్తి పోలీస్ స్టేషన్ (పోలీస్ స్టేషన్ )పరిధిలో జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద సుమారు 3 తులాల బంగారం,70 తులాల వెండి వస్తువులు, ఒక కారు,ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.రికవరీ ఆస్తుల మొత్తం సుమారు రూ.6.25 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు దాసరి మురళీకృష్ణతో( దాసరి మురళీకృష్ణ ) పాటు అతని సహచరులు నెల్లికుదురు మండలానికి చెందిన పాత నేరస్తులుగా పేర్కొన్నారు.
వీరిపై గతంలో కూడా దొంగతనం కేసులు నమోదై ఉండగా,పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది.నిందితులు పాలకుర్తి, కేశవపట్నం,చొప్పదండి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.
అరెస్టు చేసిన నిందితులు దాసరి మురళీకృష్ణ (30), మునిగెలవీడు గ్రామం,నెల్లికుదురు మండలం,మహబూబాబాద్ జిల్లా దాసరి మురళి (28),మునిగెలవీడు గ్రామం,నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా ఇద్దరు బాల నిందితులు (CCLs).ఈ కేసును సక్రమంగా ఛేదించినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లు పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్ఐ డి.పవన్‌కుమార్, ఐడీ అసిస్ట్ అనలిస్ట్ సల్మాన్,హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి,కానిస్టేబులు రమేష్, రాజ్‌కుమార్, ఇంటివేసయ్య,యాకేశ్వర్కుమార్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు రాత్రివేళ బయట నిద్రించే సమయంలో బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని, ఇంటికి తాళాలు వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

