మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. మహబూబ్నగర్ నిర్మాణ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి త్వరగా భూసేకరణ పూర్తి చేయవలసి ఉంది. నిధుల విషయంలో జా ప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగే లా చూస్తామని సిఎం భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండిం గ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని రేవంత్రెడ్డి ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
సిఎం రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టు పనులకు సంబంధించి మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సిఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశా రు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యె న్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు.

