- భూతగాదాలే హత్యకు కారణం
- ఐదుగురు నిందితులు అరెస్ట్
సూర్యాపేట, వెలుగు: భూమి గెట్టు తగాదాల కారణంగా ఓ వ్యక్తిని తమ పాలోళ్లే హత్య చేశారు. సోలిపేటలో మేకల జయరాములు హత్య కేసును సూర్యాపేట పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఏర్పాటు. జయరాములు తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమిని గతంలో తమ్ముడు కృష్ణయ్యకు కౌలుకు ఇచ్చాడు. తర్వాత తిరిగి భూమిని తీసుకుని తానే సాగు చేయడం మొదలుపెట్టాడు. భూమి, గెట్టు, ఇంటి హద్దుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ కృష్ణయ్యతో పాటు అతడి భార్య లక్ష్మమ్మ, కొడుకు కిరణ్, కోడలు మౌనిక, మరో వ్యక్తి రామచంద్రుడు కలిసి జయరాములును హత్య చేయడానికి ప్లాన్ చేశారు. సోమవారం సాయంత్రం జయరాములు పొలం వద్దకు వెళ్తుండగా గ్రామ ఆర్చ్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు.
హత్య అనంతరం నిందితులు గ్రామం విడిచి పారిపోయారు. పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ ను ఎస్పీ అభినందించారు.

