పూణె పోర్స్చే యాక్సిడెంట్ వేడుక వీడియో: పుణె పోర్షే కారు ప్రమాద కేసు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ విషాద ఘటన ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. నిందితులకు బెయిల్ రావడం, ఆ తర్వాత సంబరాలు చేసుకుంటున్న వీడియోలు బయటకు రావడం బాధితుల కుటుంబాల్లో తీరని ఆవేదనను నింపుతోంది.
2024 మే నెలలో పుణెలో మద్యం మత్తులో ఓ మైనర్ నడిపిన పోర్షే కారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటనను ఎవరూ మర్చిపోలేరు. ఈ కేసులో విచారణ పేరుతో సాగిన ప్రహసనం ఇప్పుడు బాధితుల ఆవేదనకు పరాకాష్టగా మారింది. నిందితుడైన మైనర్‌కు అప్పట్లోనే కేవలం రోడ్డు భద్రత వ్యాసం రాయాలి అనే వింత కండిషన్‌తో బెయిల్ ఇవ్వడం ఒక ఎత్తైతే, తాజాగా నిందితుడి తండ్రికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. మరీ ముఖ్యంగా, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుల కుటుంబం భారీ పార్టీలు చేసుకుంటూ, నోట్ల దండలతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
– ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చంపారు
– మద్యం మత్తులో ఉన్నాడు
– ఒక వ్యాసం రాయమని అడిగారు
– తండ్రి & తల్లి రక్త నమూనాలను తారుమారు చేశారు
– తండ్రి 22 నెలలు జైల్లో ఉన్నాడు
– తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది
– హీరోలాగా జరుపుకున్నారు & స్వాగతించారు pic.twitter.com/NuWNzu3jVJ— తరుణ్ గౌతమ్ (@TARUNspeakss) మే 27, 2026
చట్టం అంటే భయం లేదు – బాధితురాలి తండ్రి ఆవేదన
ఈ పరిణామాలపై మరణించిన అశ్విని కోష్ఠ తండ్రి సురేష్ కోష్ఠ తీవ్ర స్థాయిలో ఉంది. ఇద్దరు వ్యక్తులను చంపి సంబరాలు చేసుకోవడం వారి సమాజంలో అలవాటు కాబోలు.. ఇది సామాన్య పౌరులను అవమానించడమే అంటూ ఆయన నిప్పులు చెరిగారు. చట్టంలోని లొసుగులను వాడుకుని శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని, మైనర్ అనే ముసుగులో వారు ఏమైనా చేయవచ్చనే ధీమాతో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు హైకోర్టు వేస్తే, సుప్రీంకోర్టు వదిలేస్తోందని.. ఇది నేరస్తులను ప్రోత్సహించడమేనని ఆయన గుర్తు చేశారు.
రక్తానికి రక్తం.. కఠిన చట్టాలు రావాలి!
భారతదేశంలో చట్టం పట్ల భయం పోయిందని, ముస్లిం దేశాల్లో రక్తంగా రక్తం అనే కఠిన శిక్షలు అమల్లోకి వస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగిన సురేష్ కోష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న ఆయన, నిందితులకు బెయిల్ రద్దు చేయాలని, వారి తల్లిదండ్రులను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకుండా, నిందితులు హీరోల్లా సంబరాలు చేసుకోవడం మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు.
#చూడండి | 2024 పూణే పోర్స్చే క్రాష్ కేసు | జబల్పూర్, MP: బాల్య నిందితుడికి బెయిల్‌పై మరియు అతని కుటుంబం చేసిన వేడుకల వైరల్ వీడియో, మృతులలో ఒకరైన అశ్విని తండ్రి సురేష్ కోష్ట ఇలా అన్నారు, “ఇద్దరిని చంపి, ఆపై సంబరాలు చేసుకోవడం వారి సమాజంలో ఒక పద్ధతిగా ఉండాలి… వారు… pic.twitter.com/TP2te8YLja
– ANI (@ANI) మే 27, 2026
సాక్ష్యాల తారుమారు.. అడుగడుగునా కుట్ర!
ఈ కేసు కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, అడుగడుగునా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు జరిగిన కుట్ర అని పోలీసుల విచారణలో తేలింది. మైనర్ నిందితుడిని కాపాడేందుకు అతని తల్లిదండ్రులు డాక్టర్లతో కుమ్మక్కై బ్లడ్ శాంపిల్స్ మార్చడం, డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చి నేరాన్ని ఒప్పుకోమని చెప్పడం దేశవ్యాప్త ఆగ్రహానికి గురిచేశాయి. తండ్రి విశాల్ అగర్వాల్ సుమారు 22 నెలల పాటు జైలులో ఉన్నారు, తాజాగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. కానీ, బయటకు వచ్చిన వెంటనే ఆ కుటుంబం తీరు జనం నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందించారు.
మీరు అత్యాచారం చేయవచ్చు, హత్య చేయవచ్చు, ద్వేషపూరిత ప్రసంగాలు చేయవచ్చు, ప్రమాదాలలో ప్రజలను చంపవచ్చు… మా న్యాయవ్యవస్థ తప్పకుండా బెయిల్ మంజూరు చేస్తుంది. కానీ… కానీ.. కానీ.. నీ పేరు ఉండకూడదు #ఉమర్ ఖలీద్. #కేవలం https://t.co/vj8nAtIvMH
– ప్రకాష్ రాజ్ (@prakashraaj) మే 27, 2026
పుణె పోర్షే కేసు ధనవంతుల అహంకారానికి, చట్టం బలహీనతకు నిదర్శనంగా మిగిలిపోతోంది. సామాన్యుడి ప్రాణానికి వెలకట్టలేని స్థితిలో, చట్టం ధనికుల పక్షాన నిలబడుతోందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంకా చదవండి

